స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలు హత్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్ నుంచి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోన్నమరో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్’. వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ‘షాదీ ముబారక్’ మార్చి 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
సాధారణంగా పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి తమకు ఒకరికొకరు ఎలా నచ్చాం, ఎందుకు నచ్చాం అనే విషయాలను పలు అంశాల ఆధారంగా నిర్దారించుకుంటారు. కానీ ‘షాదీ ముబారక్’ చిత్రంలో హీరోయిన్ తను పెళ్లి చేసుకునే యువకుడే కాదు.. తన ఇంటిపేరు కూడా అందంగా ఉండాలనుకునే రకం. కొన్ని పరిస్థితుల్లో అలాంటి అమ్మాయికి డిఫరెంట్ ఇంటి పేరుండే హీరో పరిచయమైతే ఎలా ఉంటుంది. అనే పాయింట్ మీద ‘షాదీ ముబారక్’ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తుంటే అవగతమవుతుంది. టీజర్ చాలా ఎంటర్‌టైనింగ్ ఉండటంతో సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది.
నటీనటులు:
వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్, ప్రియదర్శి రామ్, హేమంత్, శత్రు, భద్రమ్, మధునందన్, అదితి, అజయ్ ఘోష్ తదితరులు
సాంకేతిక వర్గం:
ఆర్ట్: నాని
ఎడిటర్: మధు
సంగీతం: సునీల్ కశ్యప్
కెమెరా: శ్రీకాంత్ నారోజ్
లైన్ ప్రొడ్యూసర్: బండి రత్నకుమార్
అసోసియేట్ ప్రొడ్యూసర్: టి. శ్రీనివాస్‌రెడ్డి
నిర్మాతలు: రాజు, శిరీష్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.