క్రితిశెట్టి…
కళ్లతోనే కోటి భావాలు పలికించే అభినయం ఈ అమ్మడు సొంతం కనుకనే ఈ కన్నడ సోయగం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ ఫేవరేట్. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయం అవుతున్న `ఉప్పెన` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ క్రితిశెట్టి మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు..
డాక్టర్ అవ్వాలనుకున్నాను..
మాది బెంగుళూరు, నేను మాత్రం ముంబైలోనే పుట్టిపెరిగాను. మా నాన్న గారు బిజినెస్‌మేన్. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాని కెరీర్‌గా మాత్రం ఎప్పుడు అనుకోలేదు. డాక్టర్ అవ్వాలనుకున్నాను. కాలేజ్ రోజుల్లో కొన్ని యాడ్ ఫిలింస్ చేశాను. ఆ యాడ్స్ చూసి దర్శకుడు బుచ్చిబాబుగారు నాకు ఫోన్ చేసి స్టోరీ నరేట్ చేశారు. స్టోరీ విన్నాక చాలా బాగా అనిపించింది. అప్పుడే తప్పకుండా ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యి ఓకే చెప్పాను.
ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకున్నాను
బేబమ్మ క్యారెక్టర్ నా రియల్ లైఫ్‌కి కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. నేను కూడా మా పేరెంట్స్‌కి ఒక్క కూతురునే కాబట్టే ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకుని యాక్ట్ చేయడం జరిగింది. అందుకే ఎమోషనల్ సన్నివేశాలు చాలా రియలెస్టిక్‌గా వచ్చాయి.
అలా తెలుగు నేర్చుకున్నాను
నేను తెలుగు నేర్చుకోవడానికి మా డైరెక్టర్ బుచ్చిబాబుగారు చాలా హెల్ప్ చేశారు. అలాగే సెట్లో ప్రతి ఒక్కరూ నాతో తెలుగులోనే మాట్లాడేవారు. ఇద్దరు ట్యూటర్స్‌ని పెట్టి ప్రతి సన్నివేశం అర్ధమయ్యేలాగా వివరించేవారు. అందుకే తెలుగు అంత త్వరగా నేర్చుకోగలిగాను.
అలాంటి క్యారెక్టర్స్ రావడం హ్యాపీ
వైష్ణవ్‌తేజ్ ఒక బ్రిలియంట్ యాక్టర్ అది ఈనెల 12న చూస్తారు. చాలా స్వీట్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. నాకు యాక్టింగ్‌లో విషయంలో కానీ, తెలుగు నేర్చుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. సెట్లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. ఈ మధ్యనే వైష్ణవ్‌తేజ్ ఇంటర్వ్యూలో చెబుతుంటే విన్నాను. తను కూడా ముందు వేరే ప్రొఫెషన్ అనుకుని యాక్టింగ్‌లోకి వచ్చారని..మా ఇద్దరికీ ఫస్ట్ మూవీకే మంచి పెర్‌ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ రావడం హ్యాపీ.
సీన్ నేనప్పటికీ మర్చిపోలేను.
ఈ సినిమాలో వచ్చే ఒక ఎమోషనల్ సన్నివేశాన్ని చిన్నమానిటర్లో చూసి మా డిఓపి షామ్‌దత్‌గారు ఏడ్చారు. అది చూసి నాకు గర్వంగా అనిపించింది. ఆ సీన్ నేనప్పటికీ మర్చిపోలేను.
టాప్ క్లాస్ పెర్‌ఫామెన్స్ ఇస్తారు.
విజయ్‌సేతుపతిగారు సెట్లో చాలా కూల్‌గా ఉంటారు. కాని ఒక సారి యాక్షన్ చెప్పగానే టాప్ క్లాస్ పెర్‌ఫామెన్స్ ఇస్తారు. అది చూసి నేను ఆశ్చర్చపోయేదాన్ని. మా ఇద్దరి మధ్య ఒక పెద్ద సీన్ ఉంటుంది అది చేయగలనా లేదా అన్నపుడు సేతుపతి గారు కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. ఆ సీన్ చాలా బాగుంటుంది.
ఆ ధైర్యమే సినిమా అంతా క్యారీ చేశాను
ఈ సినిమాకి సైన్‌చేసేటప్పుడు చిరంజీవిగారి గురించి తెలుసు కాని మిగతా వారి గురించి పెద్దగా తెలీదు. కాని ఫస్ట్‌లైమ్ సుకుమార్‌గారిని కలవగానే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన ఇచ్చిన ధైర్యమే సినిమా అంతా క్యారీ చేశాను.
సినిమా చూస్తున్నప్పుడు చాలా సార్లు ఏడ్చాను
నాకు యాక్టింగ్‌లో శ్రీదేవిగారు ఇన్స్‌పిరేషన్. ఇప్పుడు సమంత గారి నటన అంటే చాలా ఇష్టం. ఈ కథ 2002లో జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఒక రియల్ లైఫ్‌స్టోరీ విన్నాను కాబట్టి చాలా కనెక్ట్ అయిపోయాను. మంచి ఎమోషన్ ఉన్న ఒక ప్యూర్ లవ్‌స్టోరి. సినిమా చూస్తున్నప్పుడు నేను కూడా చాలా సార్లు ఏడ్చాను. రేపు థియేటర్‌లో ప్రతి ఒక్కరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా డైలాగ్స్‌కి చాలా మంచి పేరు వస్తుంది.
సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లారు.
నీ కన్నునీలిసముద్రం, జల జల జలపాతం నువ్వు` పాటలంటే నాకు చాలా ఇష్టం. దేవిశ్రీప్రసాద్‌గారు తన మ్యూజిక్‌తో సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లారు. నా ఫస్ట్ మూవీకి సుకుమార్‌గారి లాంటి పెద్ద డైరెక్టర్ సపోర్ట్, మైత్రి మూవీస్ వంటి భారీ నిర్మాణ సంస్థ, దేవిశ్రీ ప్రసాద్‌గారి లాంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయడం చాలా స్పెషల్‌గా అనిపించింది.
మెగాస్టార్ నా గురించి మాట్లాడడం సంతోషంగా అనిపించింది.
సినిమా చూసి సుకుమార్‌గారు, కొరటాలశివగారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలాగే మా ప్రొడ్యూసర్స్ నవీన్‌గారు, రవి గారు ఫోన్ చేసి నా పాత్ర గురించి చాలా సేపు మాట్లాడారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా మందికి ఇన్స్‌పిరేషన్ అయిన మెగాస్టార్‌గారు నా గురించి మాట్లాడుతున్నప్పుడు ఓమైగాడ్ అనిపించింది.
మంచి పాత్రలు కావడంతో ఓకే చెప్పాను.
నా ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాల్లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాను అలాగే సుధీర్‌బాబు గారితో ఒక సినిమా చేస్తున్నాను. మంచి పాత్రలు కావడంతో ఒప్పుకోవడం జరిగింది.
నేను చాలా మందికి ఫ్యాన్‌ని.
నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారని నేను ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను చాలా మందికి ఫ్యాన్‌ని. సోషల్ మీడియాలో నా ఫ్యాన్ క్లబ్స్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. వారి లవ్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా…