స్టార్ హీరోలు మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్ నటించిన యూత్ డ్రామా గ్యాంగ్స్ అఫ్ 18 తెలుగు ట్రైలర్ విడుదల

0
342

స్టార్ హీరోలు మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ ప్రత్యేక పాత్రల్లో నటించిన యూత్ డ్రామా గ్యాంగ్స్ అఫ్ 18 . శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత జీ వెంకట సాంబి రెడ్డి తెలుగు లో విడుదల చేస్తున్నారు .

ఈ సినిమా కు సంబందించిన తెలుగు ట్రైలర్ ను నేడు ప్రముఖ హీరో సుమంత్ , డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి విడుదల చేసారు .

హీరో సుమంత్ గారు మాట్లాడుతూ – ట్రైలర్ చాల అద్భుతంగా ఉంది , ప్రొడ్యూసర్ సాంబి రెడ్డి గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను , సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఆడుతుంది అని నమ్ముతున్నాను . సినిమాలో మమ్మూటీ , ఆర్య , ప్రిథ్వి రాజ్ లాంటి చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు . ఐ విష్ ది హోల్ టీం అల్ ది బెస్ట్ .

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ – సాంబి రెడ్డి గారు మా ఫ్యామిలి కి చాలా ఏళ్ళ నుంచి క్లోజ్ , గ్యాంగ్స్ అఫ్ 18 ట్రైలర్ చాలా బాగుంది , ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. సాంబి రెడ్డి గారికి వాళ్ల టీం కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .

నిర్మాత జీ .సాంబి రెడ్డి గారు మాట్లాడుతూ – హీరో సుమంత్ గారు మా గ్యాంగ్స్ అఫ్ 18 ట్రైలర్ విడుదల చేసినందుకు మా ధన్యవాదాలు , మా బ్యానర్ ద్వారా ఈ సినిమా ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది , తెలుగు ప్రేక్షకులకు ఖచ్చింతంగా ఈ సినిమా నచుతుంది అని మా గట్టి నమ్మకం. మా శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి మంచి సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాం .

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి నందన్ రెడ్డి గారు మాట్లాడుతూ – హీరో సుమంత్ గారు మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది , అక్కినేని ఫ్యామిలి కి చాలా పెద్ద ఫ్యాన్ నేను . మా ట్రైలర్ ను విడుదల చేసినందుకు సుమంత్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను . సినిమా యూత్ కి చాలా కనెక్ట్ అవుతుంది . మంచి కాలేజీ డ్రామా , ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరితో కలిసి చూడాల్సిన సినిమా . మలయాళం స్టార్స్ మమ్ముట్టి , ఆర్య ,ప్రిథ్వి రాజ్ సుకుమార్ , ఉన్ని ముకుందన్ , ప్రియమణి తదిదరులు నటించారు , విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తాం .

దర్శకత్వం : శంకర్ రామకృష్ణన్
మ్యూజిక్ :ఏ.హెచ్ .కాషిఫ్
ఛాయాగ్రహణం : సుదీప్ ఎల్మోన్
తారాగణం : మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ , ప్రియమణి , అహనా కృష్ణ .
నిర్మాత : జి వెంకట సాంబి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గోపి నందన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ :భరణి కె ధరన్
డిజిటల్ పార్టనర్ : ఆపిల్ ట్రీ ప్రొడక్షన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here