దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న RRR సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారు.
మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని, హాలీవుడ్ స్టార్ అలిసన్ డూడీ సహా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు. ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించారనేదే కథాంశం. ఈ సందర్భంగా ….
చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ “`ఆర్ఆర్ఆర్` చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మిగిలిన కార్యక్రమాలను వీలైనంత తర్వగా పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది దసరాను ప్రేక్షకాభిమానులు థియేటర్స్‌లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు“ అన్నారు.