అప్పుడు మాస్…ఇప్పుడు క్లాస్.. ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ లో మెరిసిన నభా నటేష్

0
105

ఇస్మార్ట్ హీరోయిన్ నభానటేష్ జోరు మీదుంది. ఇస్మార్ట్ ర్ట్ శంకర్ లో చాందినీ అనే మాస్ రోల్ లో అదరగొట్టిన నభా ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో క్లాస్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ కి మంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.కరోనా బ్రేక్ తర్వాత ఫస్ట్ సినిమాగా రిలీజైన ఈ మూవీకి మొదటి రెండు రోజుల్లో కలెక్షన్ లు బాగా వస్తున్నాయి.

‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ లో నభానటేష్ తన మార్కును చాటుకుంది. కథ అసలైన మలుపు తీసుకున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి సెకండాఫ్ మొత్తం తనదైన క్యూట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో సాయిధరమ్ తేజ్ తో తన కెమిస్ట్రీ బాగా పండించింది.అమృత అనే రోల్ లో చలాకీ గా కనిపించి ఎంటర్ టైన్ చేసింది.అంతే కాకుండా ఈ మూవీలో నభా చాలా అందంగా కనిపించింది అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాకు నభా మంచి ప్లస్ అయిందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. చాందినీ లాంటి మాస్ రోల్ లో అయినా,అమృత లాంటి క్లాస్ రోల్ లో అయినా నభా ఈజీగా ఒదిగిపోగలనని నిరూపించింది నభా.ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నభా బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ , నితిన్ తో అంధాధూన్ తెలుగు రీమేక్ చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here