‘డర్టీహరి’ సినిమాలో నా రియ‌ల్ లైఫ్‌కి ద‌గ్గ‌రిగా ఉండే క్యారెక్ట‌ర్ చేశాను – హీరోయిన్ సిమ్ర‌త్ కౌర్

0
522

ఎంఎస్ రాజు గారు చాలా పెద్ద నిర్మాత. ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తితో సినిమా చెయ్యడమే గొప్ప విజయంగా భావిస్తాను“అంటోంది హీరోయిన్ సిమ్రాత్ కౌర్. శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్‌కౌర్‌, రుహాణిశర్మ హీరోహీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘డర్టీహరి’. ఈ చిత్రం డిసెంబర్ 18న సరికొత్త స్ట్రీమింగ్ యాప్ ఫ్రైడే మూవీస్ ఏటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సిమ్ర‌త్ కౌర్ ఇంట‌ర్వ్యూ..

బోల్డ్ గా ఉండే అమ్మాయి పాత్ర
ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు జాస్మిన్. చాలా కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ గా ఉండే అమ్మాయి పాత్ర‌. సినిమాలోనే కాదు పర్సనల్ గా ఈ రోల్ నాకు చాలా దగ్గరగా అనిపించింది. నా ఫ‌స్ట్ మూవీ ప్రేమతో మీ కార్తీక్ లో పూర్తిగా ఫ్యామిలీ అమ్మాయి రోల్ లో కనిపించా కానీ ఇందులో దానికి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తాను.

రొటీన్ క‌థ కాదు.
నేను ముంబైలో ఉన్నప్పుడు ఎం ఎస్ రాజు గారు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పి గూగుల్ లో తన పేరు సెర్చ్ చెయ్యమన్నారు, అప్పుడు చూసి ఇంత పెద్ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ నాకు కాల్ చెయ్యడం ఏంటి అనుకున్నాను. ఆయ‌న హైదరాబాద్ రమ్మని స్క్రిప్ట్ వినిపించారు. రొటీన్ క‌థ కాదు కాబ‌ట్టి చాలా కొత్తగా అనిపించింది. న‌టిగా పెర్‌ఫామ్ చేయ‌డానికి స్కోప్ ఉండడం, మరిన్ని రోల్స్ చెయ్యడానికి ఇంకా కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర‌వ్వ‌డం జ‌రిగింది.

అదే గొప్ప విజయం
ఎం ఎస్ రాజు గారు చాలా పెద్ద నిర్మాత. ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతో సినిమాల చేశారు. మరి అలాంటి వ్యక్తితో ఓ సినిమా చెయ్యడం అనేదే చాలా గొప్ప విజయం అనుకుంటాను. సెట్లో ఆయన చాలా కూల్ గా ఉంటారు. ఈ సినిమా టైమ్‌లో యాక్టింగ్ తో పాటు జీవితానికి సంబందించి ఎన్నో విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం జ‌రిగింది.

తెలుగులో కొన్ని మంచి స్క్రిప్ట్స్ వ‌స్తున్నాయి.
ఓ నటిగా న‌న్ను నేను నిరూపించుకునే ఎలాంటి పాత్ర అయినా చేయ‌డానికి సిద్ద‌మే.. అలాగే నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. కరాటేలో గోల్డ్ మెడల్ కూడా సాధించాను. మా అమ్మానాన్నలు కూడా ఒలంపిక్ ప్లేయర్స్ కాబ‌ట్టి ఏదైనా స్పోర్ట్ రోల్ లో న‌టించాలి అనేది నా డ్రీమ్‌. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తెలుగులో కొన్ని మంచి స్క్రిప్ట్స్ వ‌స్తున్నాయి. ఇంకా ఫైన‌ల్ కాలేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here