ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం ప్రొడక్షన్ టీం స్పెషల్ గా వేసిన భారీ సెట్ లో చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అవసరమైన అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలచేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా తమన్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటొగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: సత్యనారాయణ డి.వై, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.