ఆర్‌ఆర్‌ఆర్‌’ దీపావళి సర్‌ప్రైజ్‌..ఫొటోస్ వైరల్

0
70

అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం నుంచి దీపావళి స్పెషల్
సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వెలుగుల పండుగ సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, స్పెషల్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన చిత్రబృందం.. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ దీవాళి ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంది. ఈ ఫొటోలలో రాజమౌళి, ఎన్టీఆర్‌, చెర్రీ సరదాగా మాట్లాడుకుంటూ.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుంచి అనుకోని విధంగా సర్‌ప్రైజ్‌ రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. లైకులు, షేర్స్‌తో తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్పెషల్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here