మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ వేదికగా తెలిపారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను’అని చిరంజీవి పేర్కొన్నారు.



