ఓ సాధారణ వ్యక్తి.. అసాధారణమైన కలే ‘ఆకాశం నీ హద్దురా` – సింగం సూర్య‌

0
133

సింగం సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరరై పోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అప‌ర్ణ బాల ముర‌ళి హీరోయిన్‌గా న‌టించారు. ఎయిర్ డెక్క‌న్ అధినేత గోపీనాథ్ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్ర‌మిది. క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్‌ 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సూర్య, వెబినార్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు.

కెప్టెన్ గోపినాథ్ జీవితం ఆధారంగా
స్పైస్ జెట్ విమాన సంస్థ అధినేత కెప్టెన్ గోపినాథ్ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా ఆకాశమే నీ హద్దురా చిత్రం రూపొందింది. గోపీనాథ్‌గారు స్కూల్‌ మాస్టర్‌ కుమారుడు. అయితే విమానరంగంలో తనదైన ముద్రను వేయడానికి కలలు కన్నారు. ఆ కలలను నేర్చువేర్చుకునే క్రమంలో ఎలాంటి ఛాలెంజెస్‌ను ఫేస్‌ చేశారు. వాటిని ఎలా అధిగమించారనేదే సినిమా. గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ఇండియాలో భాగమైన వ్యక్తుల్లో గోపీనాథ్‌గారు ఒకరు. 23 వేల రూపాయలున్న విమానటికెట్‌ను నాలుగువేల రూపాయలకు తగ్గించారు. ఐదు వందల రూపాయలు, రూపాయకి కూడా విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. అత‌ని జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఓ సాధారణ వ్యక్తి.. అసాధారణమైన కలే ఈ సినిమా. ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచేలా ఉంటుంది.

అన్నీ అలా కలిశాయి
సుధా కొంగర.. నా రాఖీ సిస్టర్‌. మణిరత్నంగారు తెరకెక్కించిన ‘యువ’ సమయంలో నేను సుధా కొంగరను కలిశాను. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. ‘గురు’ సినిమా చూసిన తర్వాత ఆమెతో పనిచేయాలని అనుకున్నాను. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆమె మైండ్‌లో ఈ క్యారెక్టర్‌ రన్‌ అవుతుంది. ఆమె చెప్పడంతో అలా అన్నీ కలిశాయి. అలాగే ఆకాశమే నీ హద్దురా సినిమా షూటింగులో ఎక్క‌డా కాంప్రమైజ్ కాలేదు. తనకు నచ్చే వరకు సీన్‌ను నాతో చేయించి ఓ రకమైన టార్చర్ పెట్టారు. దాదాపు ఆమె డ్రిల్ మాస్టర్‌ మాదిరిగా వ్యవహరించారు. ఈ సినిమాను చేయడానికి ముందు ఎయర్‌ డెక్కన్‌ అధినేత గోపీనాథ్‌గారిని బెంగుళూరులో కలిశాం. ఆయనతో గంటసేపు మాట్లాడాం. నాకంటే సుధానే ఆయనతో ఎక్కువసేపు మాట్లాడారు.

మరచిపోలేని అనుభవం
ఈ సినిమా చేసే సమయంలో నా గత అనుభవాలు గుర్తుకు వచ్చాయి. ఓ నటుడి కుమారుడు అయినప్పటికీ .. నా డిగ్రీ అయిన తర్వాత నేను గార్మెంట్‌ కంపెనీలో పనిచేశాను. అక్కడ ఆరేడు వందలు సంపాదించాను. అదంతా మరచిపోలేని అనుభవం. అవన్నీ ఈ సినిమా చేసే సమయంలో నాకు ఆ విషయాలన్నీ గుర్తుకువచ్చాయి.

మోహన్‌బాబుగారు గ్రేట్‌ పర్సన్‌
నాకు ఈ సినిమాలో మోహన్‌బాబుగారు నా మెంటర్‌లా కనిపిస్తారు. ఆయన గ్రేట్‌ పర్సన్‌. కథ విన్న రోజునే, నీకు కోసం నేను ఈ సినిమా చే్స్తున్నానని అన్నారు. ఆయన ఎంతో సీనియర్‌ రజినీకాంత్‌ వంటి స్టార్స్‌తో కలిసి ట్రావెల్‌ చేశారు. పార్లమెంట్‌ మెంబర్‌గా, నటుడిగా, నిర్మాతగా ఆయన ఎంతో జీవితాన్ని చూశారు. అయితే, నటుడిగా ప్రతి విషయాన్ని డైరెక్టర్‌కు ఎలా కావాలో అలా చేస్తూ వచ్చారు. పాత్రకు, డైరెక్టర్‌కు ఆయన సరెండర్‌ అయ్యి నటించారు. పరేష్‌రావెల్‌గారు కూడా అంతే. వీళ్లందరూ లెజెండ్రీ యాక్టర్స్‌. కానీ ఓ డైరెక్టర్‌కి వాళ్లు ఇచ్చే రెస్పెక్ట్‌ వేరుగా ఉంటుంది.

పండుగ వాతావరణాన్ని తీసుకువ‌స్తుంది
కానీ ఆకాశమే నీ హద్దురా చిత్రం తప్పుకుండా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో తప్పనిసరిగా సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. కాకపోతే ఈ చిత్రాన్ని ఇంటి సభ్యులందరూ హ్యాపీగా అందరు కలిసి చూడటానికి వీలు పడుతుంది. ఇంటిలో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందని అనుకొంటున్నాను

గర్వంగా అనిపిస్తుంది
జ్యోతిక ఛాయిస్‌లను,ఆమె చిత్రాలను చూస్తుంటే, చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ఆమెకు ఇంకా డిఫరెంట్‌ స్క్రిప్ట్‌ వస్తున్నాయి.

చర్చలు జరుగుతున్నాయి
ఆకాశమే నీ హద్దురా సినిమాను హిందీలో డబ్‌ చేయాలా? రీమేక్‌ చేయాలా? అని ఆలోచిస్తున్నాం. ప్ర‌స్తుతం చర్చలు జరుగుతున్నాయి. వేరే హీరోలు ఈ పాత్రలో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here