రెబల్‌స్టార్‌ ప్రభాస్ పుట్టిన‌రోజు కానుక‌గా అక్టోబర్‌ 23న ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’

0
20

బాహుబలి, సాహో వంటి ప్యాన్‌ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా జిల్‌ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రెబల్‌స్టార్‌ డా. యూవీ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్,‌ ‌గోపికృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీదా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్నఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.. ప్రముఖ విఎఫ్‌ఎక్స్‌ టెక్నీషియన్‌ కమల్‌ కన్నన్‌ ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ విభాగంలో పని చేస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. అక్టోబర్‌ 23న హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‌ ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో ‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్న‌ట్లు తెలిపింది చిత్ర యూనిట్. ‘వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం’ అంటూ మేకర్స్‌ ప్రకటించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here