సమంత కొత్త రెసిపీ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్

0
318

ఉపాసన కొణిదెల “యువర్ లైఫ్” వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ నాయిక సమంత కొత్త కొత్త రెసిపీలను వ్యూయర్స్ కు పరిచయం చేస్తున్నారు. “స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్” సెక్షన్ లో హెల్దీ అండ్ టేస్టీ వంటలతో ఆమె మంచి చెఫ్ అనిపించుకుంటున్నారు. ఉపాసనతో కలిసి సమంత చేస్తున్న రుచికరమైన వంటలతో పాటు వంటలు చేస్తున్నప్పుడు వారిద్దరి సరదా సంభాషణ మరింత ఆకర్షిస్తోంది.

“స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్” లో సమంత వేగాన్ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్ చేశారు. ఇందుకు కొబ్బరి పాలు, డార్క్ కొకోవా పొడి, ఫిల్టర్ కాఫీ డికాక్షన్, వెనీలా, మాపుల్ సిరప్ లేదా బెల్లం సిరప్, సబ్జా గింజలను కలిపి రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టడం ద్వారా చాలు సులువైన రుచికరమైన రెసిపీ తయారు చేశారు సమంత. మరుసటి రోజు ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ రుచి చూడటం ప్రారంభించి గ్లాస్ లో ఉన్న ఫుడ్డింగ్ మొత్తం తినేసేదాక ఆపలేదు సమంత. అంత రుచిగా ఆమెకు నచ్చిందా రెసిపీ. ఈ సందర్భంగా ఉపాసనతో మాట్లాడుతూ..తాను ఫూర్ వెజిటేరీయన్ అని తెలిపింది సమంత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here