గగనతలం నుండి దేశాన్ని సురక్షితంగా రక్షిస్తున్న భారత వాయుసేన ఆవిర్భవించి నేటికి 88 ఏళ్లు అవుతుంది. జాతీయ వైమానిక దళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. `ధైర్యవంతులైన ఐఏఎఫ్ సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా. జాతీయ భద్రత కోసం ఎల్లప్పుడూ కష్టపడుతున్న సైనికులకు అందరం రుణపడి ఉన్నాం` అన్నారు.