నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్ ఫిల్మ్ ‘ట‌క్ జ‌గ‌దీష్’ షూటింగ్ పునఃప్రారంభం

0
370

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ‘ట‌క్ జ‌గ‌దీష్‘ సినిమా షూటింగ్ గురువారం పునఃప్రారంభ‌మైంది.

ప్ర‌స్తుతం వ‌రి పొలాల్లో నైట్ ఎఫెక్ట్‌లో నాని, మ‌రికొంత‌మంది న‌టుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

షూటింగ్ పునఃప్రారంభ‌మైంద‌ని ఎనౌన్స్ చేస్తూ హీరో నాని, “జ‌గ‌దీష్ జాయిన్స్ ట‌క్ బిగిన్స్ (జ‌గ‌దీష్ జాయిన‌య్యాడు ట‌క్ మొద‌లైంది) ##TuckJagadish” అని ట్వీట్ చేశారు.

ఈ ఫిల్మ్‌లో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here