‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మిస్తున్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు పోరాట యోధులకు సంబంధించిన కల్పితగాథతో 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు టైటిల్ మోషన్ పోస్టర్‌తో పాటు భీమ్ ఫర్ రామరాజు అంటూ అల్లూరి పాత్రను ఎన్టీఆర్ వాయిస్‌లో పరిచయం చేసిన చరణ్ ప్రోమోను విడుదల చేసి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది చిత్ర యూనిట్. లాక్‌డౌన్ సమయంలోనే తారక్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన ప్రోమో విడుదలవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. కానీ ప్రోమోకు సంబంధించిన షూట్ పెండింగ్ ఉండటంతో జక్కన్న ఎన్టీఆర్ ప్రోమోను విడుదల చేయలేదు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ప్రోమో విడుదలవుతుందా? అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో రాజమౌళి అండ్ టీమ్ లేటెస్ట్ అనౌన్స్‌మెంట్ చేశారు.
ఏడు నెలలుగా ఆగిన చిత్ర షూటింగ్ త్వరలో కానుందంటూ వీడియో ద్వారా తెలిపారు మేకర్స్. వీడియోలో గేట్స్ తెరవడం, దుమ్ము పట్టిన వస్తువులను దులపడం, లొకేషన్ పరిసరాలని శుభ్రపరచడంకు సంబంధించిన విజువల్స్ చూపించారు. అంతేకాదు భీమ్‌కు సంబంధించిన సర్‌ప్రైజింగ్ వీడియోను అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్టు ఈ వీడియో ద్వారా తెలియజేశారు. చివర్లో హీరోస్ రెడీ, యాక్షన్ అని జక్కన్న అనగానే గుర్రంపై ఒకరు.. బుల్లెట్‌పై మరొకరు వచ్చే సీన్‌ను వీడియోలో చూపించారు. దీంతో ఎప్పుడెప్పుడు ప్రోమో విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rested✊🏻
Recharged🔥
Raring to go🌊And that’s how #WeRRRBack!! 🤞🏻https://t.co/h8niWpdmpo @tarak9999 @AlwaysRamCharan @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @dvvmovies #RRRMovie #RRR
— 𝗥𝗥𝗥 𝗠𝗼𝘃𝗶𝗲 (@RRRMovie) October 6, 2020