నిశ్శ‌బ్దంలో సాక్షి క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలెంజింగ్‌గా అనిపించింది – స్టార్ హీరోయిన్ అనుష్క‌

0
626

అనుష్క .. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అన‌తి కాలంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సంపాదించుకున్నారు. అరుంద‌తి, బాహుబలి, భాగ‌మ‌తి చిత్రా‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చ‌కున్న అనుష్క ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం `‌నిశ్శ‌బ్దం`‌. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ అనుష్క విలేఖ‌రుల‌తో ముచ్చ‌టించారు ఆ విశేషాలు..

ఫ‌స్ట్ టైమ్ మీ సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతుంది క‌దా ఎలా అన్పిస్తోంది?
– అది నాకు మాత్ర‌మే కాదండీ మా టీమ్ అంద‌రికీ కొత్తే..అయితే ఎంటైర్ సినిమా ఇండ‌స్ట్రీనే కొత్త‌ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన సినిమాల ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకునే మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నా వ‌ర‌కు థియేట‌ర్‌, ఓటీటీ అనేవి రెండు వేరు వేరు అంశాలు. ఒక‌దానితో మ‌రోక‌టి పోల్చ‌లేము. నేను కూడా సినిమాను థియేటర్స్ లోనే చూసి ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అయితే ఈ కొత్త ప్ర‌య‌త్నం ఎలా ఉంటుందో చూడాలి.

ఈ సినిమా మేకింగ్‌లో మీరు ఎలాంటి చాలెంజెస్ ఫేస్ చేశారు?
– ఈ సినిమాలో నాది డైఫ్ అండ్ మ్యూట్ క్యారెక్ట‌ర్‌. అయితే మాట‌లు లేకుండా కేవ‌లం సైగ‌ల ద్వార‌నే ఒక విష‌యాన్ని కన్వే చేయాల్సి రావ‌డ‌మే నేను ఫేస్ చేసిన అతి పెద్ద చాలెంజ్‌. ఈ సినిమా కోసం నేను సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇందులో ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. ఇంట‌ర్‌నేష‌న‌ల్ సైన్‌లాంగ్వేజ్ వేరే ఉంటుంది. రెండు అర్ధం చేసుకుని నేర్చుకోవ‌డం క‌ష్టంగా అనిపించింది. దీనికోసం దాదాపు రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగే ఈ సినిమాలో ప్ర‌తి ఒక్క క్యారెక్ట‌ర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇన్ని ఇంపార్ట‌న్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ద్య‌లో ఒక చెవిటి మ‌రియు మూగ అమ్మాయి పాత్ర చేయ‌డం చాలెంజింగ్ గా అనిపించింది.

ఈ చిత్రంలో మీకు బాగా థ్రిల్ అనిపించిన అంశం ఏమిటి?
– సినిమా మొత్తం యూఎస్ లో షూటింగ్ చేయ‌డం చాలా బాగా థ్రిల్లింగ్ గా అనిపించింది. అలాగే మ్యాడీ నేను నా కెరీర్ స్టార్టింగ్‌లో క‌లిసి న‌టించాం. దాదాపు 14సంవ‌త్స‌రాల తర్వాత మ్యాడీతో క‌లిసి న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది. త‌ను చాలా ఇంప్రూవ్ అయ్యారు. అలాగే అంజ‌లి. మెఖేల్‌, షాలిని, సుబ్బ‌రాజు ఇలా అన్ని క్యారెక్ట‌ర్స్ క‌లిపి క‌థ‌ను ముందుకు తీసుకెళ్తాయి. క‌థ‌లో ప్ర‌తి పాత్ర కీల‌కంగా ఉంటుంది. త‌ప్ప‌కుండా అన్ని క్యారెక్ట‌ర్స్‌కి అప్రిసియేష‌న్ వ‌స్తుంది.

ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ గురించి?
– డైరెక్ట‌ర్ హేమంత్ ఈ క‌థ‌‌ను చాలా థ్రిల్లంగ్ అంశాల‌తో ఈ క‌థ‌ను రాసుకున్నారు. అతని విజన్ మరియు చెప్పిన విధానం కొత్తగా అనిపించాయి. అందుకే అలా ఈ సినిమాను ఒకే చేసేసాను. ముఖ్యంగా స్క్రీన్ ప్లే త‌ప్ప‌కుండా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఆయ‌న ఈ స‌బ్జెక్ట్‌ని ప‌ర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశారు. ‌కోనా గారు ఈ క‌థ చెప్పిన‌ప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. నేను డైరెక్ట‌ర్ప్ యాక్ట‌ర్‌ని ఒక సినిమా ఒప్పుకునే ముందే దాని డైరెక్ట‌ర్ ఎవ‌రు? క‌థ ఏంటి అనే అంశాలు నాకు పూర్తిగా న‌చ్చాకే ఒప్పుకుంటాను.

మీ సినిమాలకు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు?
– ఈ బ్రేక్స్ ఏవి నేను కావాలని తీసుకోలేదు, నేను చేసిన భాగమతి తర్వాత చాలా అలసిపోయాను అందుకే కాస్త విరామం తీసుకుందాం అనుకున్నాను. అలా బ్రేక్ తర్వాత నిశ్శబ్దం స్క్రిప్ట్ విని అది డిసైడ్ అయ్యాను.

మీ అన్ని సినిమాలలో మీ పేరే ఎక్కువగా వినిపిస్తుంది, అది ఎలా ఉంటుంది?
– అది బాగానే అనిపిస్తుంది కానీ ఒక సినిమా తీయడం అనేది వన్ మ్యాన్ షో కాదు అదంతా ఒక టీం వర్క్ మాత్రమే. నిశ్శబ్దం విషయానికి వస్తే నాకు మాత్రమే కాకుండా మొగత అందరి నటులకి కూడా సాలిడ్ రోల్స్ ఉన్నాయి. అవెలా ఉంటాయో రేపు సినిమాలో మీరు కూడా చూస్తారు.

ఇప్పటి వరకు మీ జర్నీ కోసం అడిగితే ఏం చెప్తారు?
– సూపర్ చిత్రం నుంచి ఇపుడు నిశ్శబ్దం వరకు అంతా మంచి మనుషులతో పని చెయ్యడం అదృష్టంగా అనుకుంటాను. అలాగే అరుంధతి తర్వాత నుంచి చాలా మార్పు తెచ్చింది. ఏదైనా సరే నా అభిమానులు నన్ను నమ్మిన దర్శకులు నిర్మాతలు లేకపోతే నేనూ లేను.

ఈ లాక్ డౌన్ కొత్త‌గా ఏం నేర్చుకున్నారు?
– ముందుగా నాకు నేను ఎక్కువగా సమయాన్ని ఇచ్చుకున్నాను. అలాగే చాలా సినిమాలు చూశాను, కొన్నికొత్త విష‌యాలు కూడా నేర్చుకున్నాను. అలాగే ఈ మ‌ద్య‌నే కొత్త క‌థ‌లు విన‌డం స్టార్ట్ చేశాను. ఇప్ప‌టికే రెండు చిత్రాలు సైన్ చేశాను వాటి వివరాలు నిర్మాతలు చెబితేనే బాగుంటుంది. డిసెంబ‌ర్ నుండి షూటింగ్ లో పాల్గొంటాను.

థ్రిల్ల‌ర్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఏం చెబుతారు?

ఓటిటిలో విడుద‌ల అవ్వ‌డంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఇదే, థియేట‌ర్స్ లో ఉండే సౌండ్ సిస్ట‌మ్, ఆడియో క్వాలిటీని ఆడియెన్స్ మిస్ అవుతారు, అయితే హెడ్ ఫోన్స్, హోమ్ థియేట‌ర్స్ ఈ లోపాన్ని దాదాపుగా క‌వ‌ర్ చేస్తాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ పెద్ద ఎస్సెట్స్, మ‌రి ముఖ్యంగా గోపీ సుంద‌ర్ ఇచ్చిన ఆర్ ఆర్ సినిమాను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేసింది.

ఈ సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు గురించి చెప్పండి-
ద‌ర్శ‌కుడు హేమంత్ ఫుల్ క్లారిటీతో వ‌ర్క్ చేసుకుంటూ పోతారు ఆయ‌న డైరెక్ష‌న్ లో ఈ ప్రాజెక్ట్ అత్యఅద్భుతంగా వ‌చ్చింది. ఇక నిర్మాతలు కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ గురించి వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు, ఈ ఎక్స్ పెర‌మెంట‌ల్ స్టోరీని అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా సినిమాను నిర్మించం అంత సులువు కాదు, దానికి చాలా ప్యాష‌న్ అలానే ధైర్యం కావాలి, ఆ రెండు ఉన్న నిర్మాత‌లు వీరిద్ద‌రు, చివ‌రిగా ఆక్టోబ‌ర్ 2ను ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో మా నిశ్శబ్ధం విడుద‌ల అవుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here