వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం!

0
31

వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్, రీతూ రెడ్డి హీరో హీరోయిన్లుగా వరుణ్.కె దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 1998 బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రేమకథగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల చివారివారంలో స్టార్ట్ కాబోతోంది.

పల్లెటూర్లలో ఉండే పగ ప్రతీకరాలతో ఈ చిత్ర కథాంశం ఉండబోతోంది. ఈ చిత్ర దర్శకుడు వరుణ్.కె గతంలో జ్యోతి లక్ష్మి, సఖియా, చిన్నదాన, మరోచిత్రం, మరువలేను వంటి అద్భుతమైన షాట్ ఫిలింస్ తీశారు. యూట్యూబ్ లో ఈ షార్ట్ ఫిలింస్ ప్రేక్షకాదరణ పొందాయి. ఆ అనుభవంతో వరుణ్.కె మొదటిసారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అంతా కొత్తవారితో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. త్వరలో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

హీరో: శ్రీకాంత్
హీరోయిన్: రీతూ రెడ్డి

సాంకేతిక నిపుణులు:
సంగీతం: రోహిత్
లిరిక్స్: తిరుపతి జావన్న
కెమెరామెన్: సురేష్ & బాబు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: వరుణ్.కె

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here