ఓ కొండమీది గ్రామంలో జరిగే దెయ్యం కథతో పిశాసు-2ను తెర‌కెక్కించ‌నున్న ద‌ర్శ‌కుడు మిస్కిన్

0
458

మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‌‘పిశాసు’(తెలుగులో పిశాచి) చిత్రం 2014లో విడుదలై సూపర్‌హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఆ చిత్రం అందించిన విజయంతో స‌రికొత్త క‌థా క‌థ‌నాల‌తో ‘పిశాసు-2’ పేరుతో కొత్త చిత్రం రూపొందించనున్న‌ట్లు అధికారికంగా ప్రకటించారు ద‌ర్శ‌కుడు మిస్కిన్. ఈ చిత్రాన్ని రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మురుగానందం నిర్మించనున్నారు. అందాల భామ ఆండ్రియా ఈ చిత్రంలో హీరోయిన్‌ నటించనున్నట్లు నిర్మాత మురుగానందం తెలిపారు. ఆండ్రియాతో పాటు ‘సైకో’ చిత్రంలో విలన్‌గా నటించిన రాజ్‌కుమార్‌ పిచ్చుమణి కీలక పాత్ర పోషించనున్నారు. ఇళయరాజా పెద్ద కుమారుడు కార్తీక్‌ రాజా సంగీతం అందించనున్నారు. ఓ కొండమీది గ్రామంలో జరిగే దెయ్యం కథతో ఈ చిత్రాన్ని ‘పిశాసు’ చిత్రం కంటే మరింత వెరైటీగా రూపొందిస్తానని దర్శకుడు మిస్కిన్‌ తెలిపారు. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో నీలగిరి జిల్లా మసనక్కుడిలో ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here