మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెగాస్టార్ ఆగస్ట్ 22న తన 65వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు గిప్ట్‌ను అందిస్తున్నారు. ఆగస్ట్ 22 సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం – S. తిరు, సంగీతం – మణి శర్మ, ఆర్ట్ – సురేష్ సెల్వరాజన్, ఎడిటింగ్ – నవీన్ నూలి.