సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్ ని స్వీకరించి తన నివాసంలో మూడు మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి శృతిహాసన్

0
533
ప్రముఖ సినీనటి శృతి హాసన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ చేస్తూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి శృతి హాసన్ ను నామినేట్ చేయగా అలాగే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన లోక నాయకుడు కమలహాసన్ తనయా ప్రముఖ సినీనటి శృతి హాసన్ ఈ రోజు  తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా తనని నామినేట్ చేసిన మహేష్ బాబు కి అలాగే దేవిశ్రీప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి శృతి హాసన్ మరో ముగ్గురిని నామినెట్ చేశారు. వారిలో బాలీవుడ్ ని స్టార్ హీరో హృతిక్ రోషన్,హీరోయిన్ తమన్నా, మరియు రానా దగ్గుబాటి ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here