“కలర్ ఫోటో” టీజర్ కు విశేష స్పందన

0
76

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ ప్రస్తుతం హ్యాపెనింగ్ కమెడియన్/ఆర్టిస్ట్ సుహాస్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా “కలర్ ఫోటో”. క్రేజీ హీరో విజయ దేవరకొండ ఈ సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కలర్ ఫోటో టీజర్ కి సోషల్ మీడియా తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం. “కలర్ ఫోటో” చిత్ర టీజర్ ఆన్ లైన్ లో విడుదలైన 12 గంటల్లోనే దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో సందీప్ రాజ్ దర్సకునిగా తెలుగు చిత్ర సీమ కి పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్సకుడు కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాకి స్వరాలూ సమకూరుస్తున్నాడు. శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్, బెన్ని ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో సుహాస్ సరసన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అటు ఆన్ లైన్ లో ఇటు ఆఫ్ లైన్ లో దూసుకుపోతున్న “కలర్ ఫోటో” చిత్ర టీజర్

12 గంటల్లో 1 మిలియన్ ఆర్గానిక్ వ్యూస్

అమృత ప్రొడక్షన్స్ వారు గతంలో రూపొందించిన హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలుకు ఆన్ లైన్ మీడియా లో విశేష స్పందన లభించింది. సోషల్ మీడియా ఫోల్లోవెర్స్ ని అలానే అన్ని వర్గాలు ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న సినిమాలుగా హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు నిలిచాయి. ఇప్పుడు అదే రీతిన అమృత ప్రొడక్షన్స్ వారు శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో నిర్మిస్తున్న కలర్ ఫోటో అటు డిజిటల్ ఆడియన్స్ ని ఇటు సాధారణ ప్రేక్షకులును విశేషంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో కేవలం 12 గంటల్లో 1 మిలియన్ ఆర్గానిక్ వ్యూస్ తెచ్చుకుంది.

చిత్రం: కలర్ ఫోటో
బ్యానర్: అమృత ప్రొడక్షన్
సమర్పణ: శ్రవణ్ కొంక,
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
డైరెక్షన్ : సందీప్ రాజ్
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
సహ నిర్మాత : మణికంఠ
లైన్ ప్రొడ్యూసర్ : గంగాధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here