వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటు – పీపుల్స్ స్టార్ అర్.నారాయణ మూర్తి

0
522
ప్రముఖ విప్లవ కవి,ప్రజా వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు

ప్రముఖ విప్లవ కవి,ప్రజా వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటు. ఆయన్ని ఉత్తరాంధ్రా సంతకం అని గొల్లపూడి మారుతీరావు కొనియాడారు. పార్వతి పురం మహా సభలో మహాకవి శ్రీశ్రీ మాట్లాడుతూ నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు ప్రసాదరావు, గద్దర్ అన్నారు.

వంగపండు గారు నా అర్ధరాత్రి స్వాతంత్య్రం సినిమాలో గొప్ప పాటలు రాశారు పాడారు నటించారు. నా అనేక చిత్రాలకు పాటలు రాశారు. నా చిత్ర విజయాలకు అయన పాటలు ఎంతో దోహదం చేశాయి. దాసరి నారాయణరావు గారు టీ కృష్ణ గారు, మాదాల రంగారావు గారు సినిమా లతో పాటు అనేక చిత్రాలకు పాటలు రాశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమ కే కాదు, సాహిత్య లోకానికే కాదు, తెలుగు పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు.

అయన ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను…..పీపుల్స్ స్టార్ అర్.నారాయణ మూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here