సరికొత్త సినీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ సిద్ధం…!!

0
728
సూపర్ హిట్

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే సూపర్ హిట్ మేగజైన్ ఈ వారం లేటెస్ట్ ఎడిషన్ సిద్ధంగా ఉంది. అందులోని ఈ వారం విశేషాలు…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఫోటోలు, ఆ ఈవెంట్ విశేషాలు. యూత్ స్టార్ నితిన్ కు ‘రంగ్ దే’ టీజర్ ను గిఫ్ట్ గా ఇచ్చిన చిత్ర యూనిట్.. టీజర్ విశేషాలు. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ కె నారంగ్ జన్మదినం సందర్భంగా ‘సినిమా మీద ఎన్నటికీ నాకు ప్రేమ తగ్గదు’ అంటూ ఇచ్చిన ఇంటర్వ్యూ, కింగ్ నాగార్జున, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కంబినేషన్ లో రూపొందనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విశేషాలు. నారాయణ్ దాస్ కె నారంగ్ బర్త్ డే సందర్భంగా శేఖర్ కమ్ముల విడుదల చేసిన నాగసౌర్య కొత్త సినిమా ఫస్ట్ లుక్ విశేషాలు. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సమర్పణలో దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమా త్రిభాషా చిత్రం విశేషాలు. శివకుమార్ బి. దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 22 తో హీరో గా పరిచయం అవుతున్న రూపేష్ కుమార్ చౌదరి, ఆగష్టు 2 న తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో సూపర్ హిట్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ తో పాటు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుండి విడుదల చేసిన కూల్ రొమాంటిక్ స్టిల్, ఆ చిత్ర విశేషాలు, ఆగష్టు మొదటి వారంలో పుట్టిన రోజులు జరుపుకుంటున్న దరకుడు బాబీ, సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు శివ నిర్వాణ ల స్పెషల్ బర్త్ డే ఆర్టికల్స్ మరియు హీరో నితిన్, షాలిని ల వివాహ మహోత్సవం కవరేజ్ బ్లో అప్ గా అందిస్తోంది సూపర్ హిట్.

యువహీరో రూపేష్ కుమార్ చౌదరి ’22’ మూవీ బర్త్ డే పోస్టర్, ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్, సంచలన కె జీ ఎఫ్ చాప్టర్ 2 లో విలన్ అధీరా గా నటిస్తున్న సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్, రూపేష్ పోలీస్ ఆఫీసర్ గా ’22’ మూవీ నుండి ఆకట్టుకునే మరో బర్త్ డే పోస్టర్, పంజా వైష్ణవ తేజ్, కృతి శెట్టి లు హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతోన్న ‘ఉప్పెన’ లోని చార్ట్ బస్టర్ సాంగ్ ‘ఈ కళ్ళు నీలి సముద్రం’ 97 + మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన పోస్టర్, అనుష్క శెట్టి, అంజలి, మాధవన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన నిశ్శబ్దం పోస్టర్, రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హేబా పటేల్ ల ఒరేయ్ బుజ్జిగా ఆడియో పోస్టర్, విలుకాడిగా సిక్స్ ప్యాక్ బాడీ తో నాగసౌర్య 20వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుండి కొత్త పోస్టర్ లు ఆకర్షణీయంగా ఉంది ఆకట్టుకుంటున్నాయి.

ఈ – మేగజైన్ కోసం క్లిక్ చేయండి:

http://superhit.industryhit.com/2770661/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-14th-Aug-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here