“వెనకడుగేయని కాలం పేరే KTR” బర్త్ డే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన మాజీ ఎంపీ కవిత

0
476
Kavitha Kalvakuntla

తెలంగాణ ఐటికి బ్రాండ్ అంబాసిడర్, యువతకు మార్గదర్శకుడు, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించే వ్యక్తిత్వం, హైద్రాబాద్ మహా నగరం తో పాటు తెలంగాణలోని ఇతర నగరాలను అభివృద్ధి లో అగ్రగామిగా నిలిపిన నాయకుడు, IT ని వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు విస్తరించి భవిష్యత్ తెలంగాణ స్వప్ననికుడు, కరోన కల్లోలంలో కూడా తెలంగాణకు నిధులు, పారిశ్రామిక సంస్థలను ఆకర్షిస్తున్న చరిష్మా కలిగిన నాయకుడు, తెలంగాణ నేతన్నల బతుకు ముఖ చిత్రం మార్చిన దార్శనికుడు, ప్రజాసేవకై పని చేస్తున్న అందరి అభిమాన నాయకుడు కేటిఆర్. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీమతి బొంతు శ్రీదేవీ యాదవ్ నిర్మాతగా, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, సింగర్ యాజీన్ నిజార్, సంగీతం భరత్ అడోనిస్, కొరియో గ్రాఫర్ శేఖర్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్, ఎడిటర్ వర ప్రసాద్ ఆద్వర్యంలో కేటిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన పాటను విడుదల చేసిన జాగృతి అధ్యక్షురాలు, టీఆరెస్ నాయకురాలు కవితక్క.

ఈ ప్రత్యేక గీతం రూపొందించడంలో సహకరించిన మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి కి,కొండ శరత్ గారికి ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ గారు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాట విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here