గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన 14Reels Plus నిర్మాతల్లో ఒకరైన గోపి ఆచంట

0
496
నిర్మాత గోపి ఆచంట

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు శంషాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన 14 Reels plus నిర్మాత ల్లో ఒకరైన గోపి ఆచంట.

ఈ సందర్భంగా నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుక పోతున్నారని.అతనికి మద్దతుగా హిరో శర్వానంద్ నాకు ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని మన భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని; మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా నేను ప్రముఖ డైరెక్టర్స్ హరీష్ శంకర్; పరశురాం; శ్రీకారం సినిమా డైరెక్టర్ బి. కిషోర్ లను ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here