బిగ్‌బాస్‌కి రానంటున్న త‌రుణ్‌

0
473
Tharun

ప్ర‌ముఖ హీరో త‌రుణ్ బిగ్‌బాస్-4వ సీజ‌న్‌లో పాల్గొంటార‌ని ఈమ‌ధ్య రూమ‌ర్లు అధికంగా వ‌చ్చాయి. అయితే అవ‌న్నీ అవాస్త‌వాల‌ని త‌రుణ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. “గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాల్లో, కొన్ని దిన ప‌త్రిక‌ల్లో నేను బిగ్‌బాస్‌లో పాల్గొంటాన‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. బిగ్ బాస్‌ లో పాల్గొనే ఆలోచ‌న కానీ, ఉద్దేశ్యం కానీ నాకు ఏమాత్రం లేదు. ఎప్ప‌టికీ క‌ల‌గ‌దు అని ఫైన‌ల్‌గా అంద‌రికీ స్ప‌ష్టం చేస్తున్నాను. ఇవి కేవ‌లం వ‌దంతులు మాత్ర‌మే. ద‌య‌చేసి త‌ప్పుడు వార్త‌ల‌ని ప్ర‌చాయం చేయొద్దు” అని త‌రుణ్ ఆ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here