గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన కూతురు నిర్వహణ తో కలిసి మొక్కలు నాటిన మంచు లక్ష్మి

0
508
Manchu Lakshmi

గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని నటి మంచు లక్ష్మి అన్నారు. నటి శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఫిలింనగర్ లో తన నివాసం లో మొక్కలు నాటారు. తన కూతురు నిర్వహణ కూడా ఉన్నారు. తను శ్రీగంధం మొక్క నాటుతున్నాని , ఈ మొక్కలు నాటే కార్యక్రమం తనకి , తన నాన్న మోహన్ బాబు గారికి ఎంతో ఇష్టం అన్నారు .

అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని తెలుపుతూ ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందించారు .తను మరో ముగ్గురుకి నీరజ కోనా డిసైనర్ , సంధ్య రాజు డాన్సర్ , నటుడు సందీప్ కిషన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నటి మంచు లక్ష్మి  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here