సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సూరారై పొట్రు’. ‘గురు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదలకానుంది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు,జాకీష్రాఫ్ పరేష్ రావల్ ముఖ్య పాత్రలు పోషించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కటింగ్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేశారు. కాగా తాజాగా ఈ సినిమాకి సంభందించిన అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. జీవీ ప్రకాష్ స్వరపరిచిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలోని ‘కాటుక కనులే…’ అంటూ సాగే ఈ చిత్రంలోని గీతానికి సంబంధించిన ఒక నిమిషం వీడియోని ఈ నెల 23న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది



