సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తమిళ మూవీ ‘ఓ మై కడవలే’ ను చూశాను.. ప్రతి సీన్ ను ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరి నటన అద్బుతంగా ఉంది. దర్శకుడు చాలా బాగా సినిమాను తెరకెక్కించాడు. హీరో అశోక్ సెల్వన్ నటన న్యాచురల్గా ఉంది. అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. సూపర్ స్టార్ ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఆ చిత్రం గురించి తెలుగు నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. సినిమాను చూసేందుకు సిద్దం అవుతున్నారు. కాగా మహేష్ ట్వీట్ కి స్పందించారు హీరోయిన్ రితికా సింగ్.
సూపర్ స్టార్ ట్వీట్ చేయడం నమ్మలేకపోతున్నా. థ్యాంక్యూ సో మచ్.. ఇలాంటి ప్రశంస మీ నుండి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె ట్వీట్ చేశారు. హీరోయిన్ రితికా సింగ్ తో పాటు ఓ మై కడవలే చిత్ర ఇతర యూనిట్ సభ్యులు కూడా మహేష్ ట్వీట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.



