గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి శ్రీ రాపాక

0
506
Actress Sri Rapaka

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు కాదంబరి కిరణ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన శ్రీ రాపాక….

ఈ సందర్భంగా శ్రీ రాపాక మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు డైరెక్టర్ లు రాంగోపాల్ వర్మ (RGV) , తేజ , ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ లను ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ , ప్రతినిధి కిషోర్ గౌడ్ , నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here