యంగ్ హీరో సత్య దేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కన్నడ మూవీ లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్

0
559
Satya Dev And Tamannaah To Star In 'Love Mocktail' Telugu

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ఇక తెలుగునాట మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. లవ్ మాక్ టైల్ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. అలానే ఈ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.

తారాగణం :

సత్య దేవ్, తమన్నా

సాంకేతిక వర్గం

బ్యానర్ : నాగ శేఖర్ మూవీస్

నిర్మాతలు : భావన రవి, నాగశేఖర్

డైరెక్టర్ : నాగ శేఖర్

మ్యూజిక్ : కాల భైరవ

కెమెరా : సత్య హెగ్డే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here