సూపర్ స్టార్ మహేష్ మేజర్ అజయ్ కృష్ణ గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వరుస విజయాల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ జెమిని టివీ లో ప్రసారమైన రెండు సార్లూ విశేష వీక్షకాదరణ పొందింది. గత సంవత్సరం జులై 5న కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం 6 నెలల్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలైంది.
దర్శకుడు అనిల్ రావిపూడి నేడు (జూలై 5) ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ లో… సరిగ్గా సంవత్సరం క్రితం ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ గారితో యాక్షన్ అంటూ బొమ్మ మొదలైన 6 నెలల్లో బొమ్మ దద్దరిల్లిపోయింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన టీం కి ప్రేక్షకుల కి కృతజ్ఞతలు అంటూ మహేష్ తో తను ఉన్న షూటింగ్ మొదటి రోజు స్టిల్ ను పోస్ట్ చేశారు.
July 5th – Last year this day started with saying "ACTION" to Superstar @Urstrulymahesh garu. Started shoot on this day and release in 6 months. "బొమ్మ మొదలైంది" to "బొమ్మ దద్దరిల్లిపోయింది" in 6 months. Thanks to my team and audience for this great experience#SarileruNeekevvaru pic.twitter.com/ag7SBEyhkw
— Anil Ravipudi (@AnilRavipudi) July 5, 2020



