స్వాతంత్ర్యదినోత్సవ రోజు కానుకగా ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అజయ్ దేవగన్ ‘మైదాన్’

0
445
Ajay Devgn Announced Maidaan Release Date

భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. ఫుట్ బాల్ కోచ్ గా అజయ్ దేవగన్ నటిస్తోన్న మైదాన్ ను క్రీడా నేపథ్యంలో ఒక స్ఫూర్తిమంతమైన కథగా నిర్మిస్తున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్ర్యదినోత్సవ రోజు కానుకగా మైదాన్ ను ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఇతివృత్తం ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న `మైదాన్` చిత్రం ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here