గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తన తల్లి గీతా భాస్కర్ తో కలిసి మొక్కలు నాటిన దర్శకుడు తరుణ్ భాస్కర్

0
776
Tharun bhascker accepted green india challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 వ విడత లో బాగంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి బంజారాహిల్స్ లోని తన నివాసంలో తల్లి గీతా భాస్కర్ తో కలిసి మొక్కలు నాటిన తరుణ్ భాస్కర్…

తరుణ్ భాస్కర్ ,సినీ దర్శకులు, “ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఎందరో సెలెబ్రెటీస్ ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత గానో ఉంది. కరోనా వల్ల మనం చాలా నేర్చుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి ఛాలెంజ్ లు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్న.”

నటులు విజయ్ దేవరకొండ, రీతూ వర్మ,అభయ్ బెతిగంటి ముగ్గురిని నామినేట్ చేసిన తరుణ్ భాస్కర్.

గీతా భాస్కర్ ,తరుణ్ భాస్కర్ తల్లి, “ఈ ఛాలెంజ్ లో నేను పాల్గొనడం సంతోషం గా ఉంది. ఈ సమయంలో కూడా దీన్ని ముందుకు తీసుకు వెళ్లడం చాలా గొప్ప విషయం. ఈ ఛాలెంజ్ కు మరింత ముందుకు వెళ్ళాలి.”

తరుణ్ భాస్కర్ భార్య లత ని ఛాలెంజ్ విసిరిన గీతా భాస్కర్.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ ,కిషోర్ గౌడ్ పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here