ఎప్పుడు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించే ఫ్యాన్స్ ఈ సారి కరోనా మహమ్మారి వలన హీరోల పిలుపు మేర సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. జూన్ 22 ఇలయదళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ వేడుకలని ఘనంగా నిర్వహించాలని భావించారు. కాని విజయ్ రిక్వెస్ట్ వలన వెనక్కి తగ్గారు. అయితే విజయ్ బర్త్‌డే రోజు నాడు అభిమానులని ఆనందింపజేయాలని భావించిన మేకర్స్ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ లోని విజయ్ పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ మాస్టర్ పవర్‌ఫుల్ పోస్టర్ ప్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
గతేడాది కార్తి హీరోగా నటించిన ఖైదీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ గా మాస్టర్ చిత్రం రూపొందుతుంది. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. మాళవిక మోహన్, అందేరా జర్మియా కథానాయికలు. ఏప్రిల్ 19న చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, కరోనా వలన వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు నిర్మాతలు.



