బిక్ష షూటింగ్‌ ప్రారంభం

0
751
Biksha Movie Opening

సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘బిక్ష’. శుక్రవారం హైదరాబాద్‌లో యు అండ్‌ ఐ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది. ప్రభుత్వం విధించిన కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ మల్లాది వెంకటేశ్వ ఫిలింస్‌ నిర్మిస్తున్న 6వ చిత్రం. తేజేశ్వర రెడ్డి, సిద్దార్థ, భరత్‌ సాగర్‌ హీరోలుగా ప్రియాన్ష, అనోన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాస్టర్‌ కుశాల్‌ రెడ్డి కీలక పాత్రధారి.

బిక్షు చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జిఎల్‌బి. శ్రీనివాస్‌. ఈయన ఇంతకు ముందు ‘మహానగరంలో శివచందు’, ‘సాయేదైవం’, ‘2 ఫ్రెండ్స్‌’, ‘స్నేహవే ప్రీతి ‘(కన్నడ) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘బిక్ష’ చిత్రం జిఎల్‌బి శ్రీనివాస్‌కు 11వ సినిమా. ‘బిక్ష’ చిత్రీకరణ హైదరాబాద్‌, కరీంనగర్‌, కంఠాత్మకూర్‌, హంపీ, విజయవాడ, వైజాగ్‌ ప్రాంతాల్లో జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని దర్శక, నిర్మాత చెప్పారు.

ఈ చిత్రంలో మల్లాది శాస్త్రి, శీలం శ్రీనివాస్‌, వెంకటేశ్‌, తాతిరాజు, బివిఎల్‌. నరసింహారావు, దేవి, చిట్టిబాబు, ధన్‌రాజ్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టి.సురేంద్ర రెడ్డి, మాటలు: జియో లక్ష్మణ్‌, పాటలు, సంగీతం: శ్రీపాల్‌, కో ప్రొడ్యూసర్‌: తీగుళ్ళ స్వప్నకిరణ్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భిక్షపతి గౌడ్‌ వడ్డేపల్లి, కొరియోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here