భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత జవానులకు దేశం మొత్తం కన్నీటి నివాళులర్పిస్తోంది. వీరిలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన వీర సైనికుడు కర్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. వీరందరికీ మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు.
`ఇరవై మంది వీర జవాన్ల మరణం నా హృదయాన్ని కలిచి వేసింది. మా కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది అని వారి తల్లిదండ్రులు చెప్పడం చాలా గొప్ప విషయం. వారి ధైర్యానికి నా సెల్యూట్. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను` అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బీహార్ 16వ బెటాలియన్ లో కల్నల్ ర్యాంకులో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.



