ప్రముఖ యాంకర్, నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమాలు, షోలు అప్‌డేట్స్‌తో పాటు యోగా వీడియోలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కూతురు విద్యా నిర్వానా గురించి ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటుంది. జూన్ 15న విద్యా నిర్వానా బర్త్‌డే వేడుకలు ఇంటిదగ్గరే ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యాకి డార్లింగ్ ప్రభాస్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. విద్యా పుట్టినరోజు నాడు ప్రభాస్ వీడియో కాల్ చేసి మరీ బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు మంచు ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ చాలాసేపు మాట్లాడారు. దీంతో విద్యా చాలా హ్యాపీగా ఫీలైందంటూ మంచు లక్ష్మి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మంచు ఫ్యామిలీకి, కృష్టంరాజు కుటుంబానికి మంచి బాండింగ్ ఉంది. పోయిన ఏడాది దీపావళి పండుగను మంచు ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ప్రభాస్.



