యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్ సాంగ్….. !!

0
467
Blockbuster ismart shankar Title song got 100 million views in youtube

యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన పలు సినిమాలు ఇప్పటికే హిందీ లో డబ్ కాబడి యూట్యూబ్ లో మంచి రికార్డ్స్ సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ లోని టైటిల్ సాంగ్ వీడియో నేడు ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ మైలు రాయిని అందుకుని యూట్యూబ్ లో సరికొత్త రికార్డు ని సొతం చేసుకుంది.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పవర్ఫుల్ మాస్ ట్యూన్ కి రామ్ ఎనర్జిటిక్ డాన్స్ తోడవడంతో ఈ సాంగ్ మంచి సెన్సేషన్ తో దూసుకెళుతోంది. కాగా దీనితో హీరో రామ్ ఖాతాలో మరొక రికార్డు చేరిందని చెప్పాలి. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ మూవీలో రామ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here