ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తదుపరి నటించబోయే 27వ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఉదయం 9 గం. 9 ని. లకు రిలీజ్ కానున్నట్లు సినిమా నిర్మాతలు కాసేపటి క్రితం ప్రకటించడం జరిగింది.
ఈ సినిమాకు పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని నిర్మించనున్నాయి. కాగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు రేపు వెల్లడికానుండడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అమితానందంలో మునిగిపోయారు …..!!