సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కొద్దిరోజులుగా లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఇకపోతే నేడు తన కూతురు సితార తో కలిసి అద్దం ముందు నిలబడి మహేష్ బాబు సరదాగా ఒక సెల్ఫీ ఫోటో దిగి, దానిని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు.
వయసు పెరుగుతున్నకొద్దీ మహేష్ బాబు అందం మరింతగా పెరుగుతోంది అనడానికి ఆ ఫోటోనే నిదర్శనం అని పలువురు ప్రేక్షకులు, అభిమానులు దానిపై కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ పోస్ట్ చేసిన ఆ ఫోటో పలు మీడియా మధ్యమాల్లో వైరల్ అవుతోంది…..!!



