ప్రభుత్వం దేశం నలుమూలల నుండి శ్రామిక రైళ్లలో వలసదారుల ను వారి స్వస్థలాలకు చేరుస్తున్నారు. ముంబై నుండి తమిళనాడు కు వస్తున్న శ్రమిక్ రైలు లోని వలస కూలీలు ఆహారం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తమిళ నాడు పోలీసుల నుండి తెలుసుకున్న ఆంధ్ర పోలీసులు గుంతకల్ లో వారికి ఆహారాన్ని అందించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
ఈ కరోనా విపత్తులో పోలీసులు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు అని ఆంధ్ర పోలీసులు చేసిన ఈ సహాయం ద్వారా పోలీసులు తాము రక్షకులు మాత్రమే కాదు సేవకులు కూడా అని చాటి చెప్పారు అన్నారు.
Kudos to the police force of the india for their selfless service In the front line of #CoronaPandemic 🙏 to @APPOLICE100 not only You are Protecting you are serving the people 👍💐#FrontLineHeroes #IndiaFightsCorona https://t.co/lwiSXcEhec
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 26, 2020



