`ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్ర థీమ్ పోస్టర్ విడుదల

0
379
Ee kathalo patralu kalpitam movie Theme poster released

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన, ల‌క్కి హీరోయిన్స్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు యూనిట్.

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ – “‘ఈ కథలో పాత్రలు కల్పితం’ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతుంది. ఆర్టిస్టులు, టెక్నిషయన్స్ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటివరకు చిత్రీకరించిన వరకు ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుంది. మా దర్శకుడు అభిరామ్ మంచి విజన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టునే థ్రిల్లింగ్ అంశాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘జెస్సీ’, రీసెంట్ గా వచ్చిన ‘ ఓ పిట్టకథ ‘ ..సినిమాలకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ కుమార్‌ విజువల్స్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘కల్కి’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ మాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. చివరి షెడ్యూల్ పూర్తి అవగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపి విడుదల తేదీని ప్రకటిస్తాం. త్వరలోనే టీజర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. లేటెస్ట్ గా విడుదలైన థీమ్ పోస్టర్ కు మంచి ఆదరణ లభిస్తోంది అన్నారు.

పవన్‌ తేజ్‌, మేఘన, ల‌క్కి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ ఎన్‌, సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఆర్‌, ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌, ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి,మాటలు: తాజుద్దీన్‌ సయ్యద్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌, కో-డైరెక్టర్‌: కె. శ్రీనివాస్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి, లైన్‌ ప్రొడ్యూసర్‌: దుర్గా అనీల్‌ రెడ్డి, నిర్మాత: రాజేష్‌ నాయుడు, రచన, దర్శకత్వం: అభిరామ్‌ ఎం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here