ప్రస్తుతం ప్రపంచాన్ని, ప్రజలను భయకంపితులను చేస్తున్న కరోనా మహమ్మరి బారినపడకుండా, తగు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రతిఒక్కరూ బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని, అది మనకు కొంతవరకు రక్షణగా ఉంటుందని ప్రజలను కోరుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది.
మనందరం మెల్లగా మన పనులను తిరిగి ప్రారంభిస్తున్నామని, బయటకు వెళ్ళేప్పుడు తప్పనిసరిగా మస్కులు ధరించాలని, అది అలవాటుగా చేసుకోవాలని మహేష్ తన పోస్ట్ లో కోరారు. ఇప్పటికే కొన్నాళ్ల నుండి కారోనా వ్యాధి పట్ల మిగతా నటుల తోపాటు ప్రజలకు తవంతుగా అవగాహన కల్పిస్తున్న సూపర్ స్టార్ మహేష్ , ప్రస్తుతం చేసిన ఈ పోస్ట్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది……!!