యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా అనేకమంది ఆయన అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఆయనకు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా కాసేపటి క్రితం హీరో విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసారు.
గతంలో చింతకాయల రవి సినిమాలోని ‘షావ షావ’ అనే సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి విక్టరీ వెంకటేష్ కొన్ని క్షణాల పాటు డాన్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సాంగ్ థియేటర్స్ లో అదరగొట్టే రెస్పాన్స్ ని సంపాదించింది. కాగా ఆ ఘటనను గుర్తు చేస్తూ, తారక్ తో కలిసి నేను డాన్స్ చేసిన ఆ సాంగ్ ని ఎప్పటికీ మరిచిపోలేను అంటూ, ఎన్టీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సాంగ్ లో వారిద్దరి డ్యాన్స్ బిట్ ని పోస్ట్ చేసారు వెంకటేష్…..!!!
Had a wonderful time shaking a leg with you for this song @tarak9999. Lots of love to you my boy. #HappyBirthdayNTR pic.twitter.com/t5QsvKcbWt
— Venkatesh Daggubati (@VenkyMama) May 20, 2020



