యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఎందరో అభిమానులు, ప్రేక్షకులతో పాటు చాలామంది సినిమా ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెల్పుతూ ఒక ట్వీట్ చేశారు.
‘బ్రదర్ తారక్ కు జన్మదిన శుభాకాంక్షలు, నీకెప్పుడు మంచే జరగాలని కోరుకుంటున్నట్లు ‘ మహేష్ బాబు ట్వీట్ చేయడం జరిగింది. మహేష్ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. మహేష్ భరత్ అనే నేను సినిమా ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరవడం, ఆ వేడుక ఇరువురి అభిమానుల మధ్య కన్నుల పండుగగా జరగడం తెలిసిందే.