ఇటీవల ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన ఎన్టీఆర్, దానిని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లకు విసరగా, వారిలో చిరంజీవి నేటి ఉదయం ఆ ఛాలెంజ్ ను పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే నేడు కాసేపటి క్రితం తన ఛాలెంజ్ ని ఇంటి పని, తోటపని, వంట పనులు చేస్తూ పూర్తి చేసిన విక్టరీ వెంకటేష్, దానిని సూపర్ స్టార్ మహేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ లకు విసరగా, తనతో పాటు ఎఫ్ 2 లో నటించిన విక్టరీ వెంకటేష్ గారితో, మీ ఛాలెంజ్ కు నేను సిద్ధం కోబ్రా అంటూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు……!!
Challenge accepted cobra!
🤗🤗🤗 https://t.co/u4U39TPLYU— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) April 23, 2020



