’’సోషల్ ఫిల్మ్ ఫెస్టివల్’’ తో మీ ముందుకు వస్తున్న పీపుల్ మీడియా సోషల్

0
1022
People Media Factory Coming With Social Film Festival

వెంకిమామ , ఓ బేబీ , గూడచారి వంటి హిట్ సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి అనుబంధ సంస్థ అయిన పీపుల్ మీడియా సోషల్ “సోషల్ ఫిల్మ్ ఫెస్టివల్’’ తో మీ ముందుకు వస్తుంది.

ఈ కాంటెస్ట్ నిబంధనలు :
1. టాపిక్ ‘’ఏంపవర్‌మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలెజ్డ్ వుమెన్’’ షార్ట్ ఫిల్మ్ ని ఆర్ధిక , సాంఘిక , సామాజిక అడ్డంకుల వల్ల మహిళలు పడే ఇబ్బందులు గురించి మాత్రమే తియ్యాలి.
2. షార్ట్ ఫిల్మ్ నిడివి ఐదు నిమిషాలు లోపే వుండాలి. మీరు ఇంట్లో సేఫ్ గా వుండి మీకు వున్నా సౌక్యరాలు తో మాత్రమే షార్ట్ ఫిల్మ్ చెయ్యాలి.
3. గవర్నమెంట్ లాక్ డౌన్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, నిబంధనలు ఉల్లంగిస్తే , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గానీ , పీపుల్ మీడియా సోషల్ గానీ ఎంటువంటి భాద్యత వహించదు.
4. ఫోన్ తో గానీ, DSLR కెమెరా తో గానీ షూట్ చెయ్యచ్చు, మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ ని filmfest@peoplemediasocial.com & peoplemediasocial15@gmail.com కి మెయిల్ చెయ్యండి, డబ్బింగ్ అవసరం లేదు, ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ క్యాలిటి సరిపోతుంది.

బాషలు: తెలుగు / ఇంగ్లీష్ / హిందీ

అవార్డ్స్ :
1. మొదటి బహుమతి : లక్ష రూపాయిలు
2. రెండో బహుమతి : యాబై వేలు రూపాయిలు
3. మూడో బహుమతి : ఇరవై ఐదు వేలు రూపాయిలు

షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్ : కృతి ప్రసాద్
జ్యూరి మెంబెర్స్ :

డైరెక్టర్ తేజ
డైరెక్టర్ హరీష్ శంకర్
డైరెక్టర్ నందిని రెడ్డి గారు
డైరెక్టర్ VN.ఆదిత్య గారు
డైరెక్టర్ బాలరాజశేఖరుని గారు,

ఫెస్టివల్ డేట్స్ :

షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేయ్యాల్సిన చివరి తేది : మే 15
అఫీషియల్ సెలక్షన్ లిస్ట్ ప్రకటించే తేది : మే 22
అవార్డ్స్ ప్రకటించే తేది : మే 31

షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఏప్రిల్ 18 2020 నుంచి మే 15 2020 మధ్య జరిగి వుండాలి. మరెంత సమాచారం కొరకు సంప్రదించండి : జల్లు కుమార్ : 9533569005

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here