స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సస్పెన్స్, థ్రిల్లింగ్ జానర్ మూవీ ‘నిశ్శబ్దం’. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ నిర్మాతలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ‘నిన్నే నిన్నే’ లిరికల్ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టడంతో పాటు, సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో నిశ్శబ్దం షూటింగ్ కూడా నిలిపివేశారు చిత్ర నిర్మాతలు.
ఇకపోతే గత కొద్దిరోజులుగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నిశ్శబ్దం’ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న పలు పుకార్లు, ప్రచారాల పై నేడు చిత్ర నిర్మాతలు స్పందించారు. తమ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న కథనాలు నమ్మవద్దు, వాటిలో ఏ మాత్రం నిజం లేదని, షూటింగ్ మొదలైన రోజు నుండి మా సినిమా నటీనటులు, టెక్నీషియన్లు మాకు ఎంతో సహకరిస్తూ తోడుగా నిలుస్తున్నారని, మరీ ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటిస్తున్న అనుష్క మాకు అండగా నిలవడం ఎంతో గొప్ప విషయం అని పీపుల్స్ మీడియా ఫాక్టరీ నిర్మాతలు ఒక అధికారిక ప్రకటనను కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అలానే మా సినిమాకు సంబంధించి ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటిని రాబోయే రోజుల్లో మేము అధికారికంగా అనౌన్స్ చేస్తామని వారు తమ పోస్ట్ లో తెల్పడం జరిగింది…..!!