ఏప్రిల్ 8తో నాకు బోలెడంత అనుబంధం ఉంది : మెగాస్టార్ ఆసక్తికర ట్వీట్

0
1245
Megastar chirajeevi About Acharya Movie

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ బంద్ కావడంతో ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది

ఇటీవల ఉగాది పండుగ నాడు సోషల్ మీడియా మాధ్యమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఎప్పటికప్పుడు పలు ఆసక్తికరమైన పోస్టులతో ఫ్యాన్స్ లో, అలానే ప్రేక్షకుల్లో మంచి జోష్ ని నింపుతున్నారు. కాసేపటి క్రితం ఏప్రిల్ 8వ తారీఖుతో తనకు బోలెడంత అనుబంధం ఉంది, సశేషం అంటూ మెగాస్టార్ ఒక ఆసక్తికర ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో మెగాస్టార్ ఆరోజున బన్నీ కి ఏదైనా స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసారా అంటూ పలువురు మెగా ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ రోజున మెగాస్టార్ ఎటువంటి విషయాన్ని వెల్లడిస్తారో చూడాలి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here